ఉత్తమ గురువులు 58 మంది | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ గురువులు 58 మంది

Sep 5 2025 8:32 AM | Updated on Sep 5 2025 8:32 AM

ఉత్తమ

ఉత్తమ గురువులు 58 మంది

మెదక్‌జోన్‌: ఉత్తమ ఉపాధ్యాయులుగా ఈ ఏడాది జిల్లాలో 58 మందిని ఎంపిక చేశారు. వీరిలో గెజిటెడ్‌ ఉపాధ్యాయులు 2, స్కూల్‌ అసిస్టెంట్లు 23, ఎస్జీటీలు 25, ఫిజికల్‌ డైరెక్టర్‌ 1, ఉర్దూ ఉపాధ్యాయులు 2, కేజీబీవీ బోధకులు 2, మోడల్‌ స్కూల్స్‌ 2, ప్రైమరీ స్కూల్‌ హెచ్‌ఎం ఒకరు చొప్పున మొత్తం 58 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. వీరికి ఈనెల 6న కలెక్టరేట్‌లో సన్మాన కార్యక్ర మం ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్‌, డీఈఓ పాల్గొని ఘనంగా సన్మానించనున్నారు.

వీధి కుక్కల నివారణకు చర్యలు

మున్సిపల్‌ కమిషనర్‌ గణేశ్‌రెడ్డి

తూప్రాన్‌: వీధి కుక్కల బెడద నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మున్సిపల్‌ కమిషనర్‌ గణేశ్‌రెడ్డి తెలిపారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద బ్లూక్రాస్‌ సంస్థ ద్వారా పెంపుడు, వీధి కుక్కలకు వ్యాక్సినేషన్‌ చేసినట్లు చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డుల్లో మూడు ప్రత్యేక వాహనాల ద్వారా 33 కుక్కలను పట్టుకొని ఏబీసీ సెంటర్‌కు తరలించామన్నారు. స్టెరిలైజ్‌ అయిన 250 కుక్కలకు యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ చేసినట్లు వివరించారు. విడతల వారీగా కుక్కల బెడద లేకుండా చర్యలు తీసు కుంటామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి లక్ష్మి, బ్లూక్రాస్‌ షెల్టర్‌ డైరెక్టర్‌ కుమారి, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కేజీబీవీ తనిఖీ

రామాయంపేట(మెదక్‌): స్థానిక కేజీబీవీ పా ఠశాలను గురువారం అదనపు కలెక్టర్‌ నగేశ్‌ తని ఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ విద్యా ప్రమాణాల దిశగా కేజీబీవీలు ముందుకు సాగుతున్నాయన్నారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం ఇవ్వాలని ఆదేశించారు. ఆయన వెంట స్కూల్‌ ప్రిన్సిపాల్‌, ఇతర ఉపాధ్యాయులు ఉన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి

హవేళిఘణాపూర్‌(మెదక్‌): ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమైన ధూప్‌సింగ్‌ తండాను గురువారం రాత్రి ఎమ్మెల్యే రోహిత్‌ పరిశీలించారు. ఈసందర్భంగా తమ బాధలను ఎమ్మెల్యేతో తండావాసులు మొరపెట్టుకున్నారు. త్వరలోనే మీ సమస్యలు పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఎంఎస్‌ఎస్‌ఓ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల కిట్‌ను అందజేశారు. కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పరశురాం, నాయకులు శ్రీనివాస్‌, మాజీ ఎంపీటీసీ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

నిమజ్జనానికి పటిష్ట

బందోబస్తు: ఎస్పీ

మెదక్‌ మున్సిపాలిటీ: జిల్లావ్యాప్తంగా గణేశ్‌ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా నిర్వహించడానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 2,963 గణపతి విగ్రహాలు నిమజ్జనం జరగనున్నాయని తెలిపారు. కార్యక్రమం సజావుగా జరిగేందుకు 546 మంది పోలీస్‌ సిబ్బందితో పాటు 4 క్విక్‌ రియాక్షన్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే పట్టణంలో 204 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చెరువులు, కుంటల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రేన్‌లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామని వివరించారు.

ఉత్తమ గురువులు 58 మంది 1
1/3

ఉత్తమ గురువులు 58 మంది

ఉత్తమ గురువులు 58 మంది 2
2/3

ఉత్తమ గురువులు 58 మంది

ఉత్తమ గురువులు 58 మంది 3
3/3

ఉత్తమ గురువులు 58 మంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement