
ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచండి
నర్సాపూర్ రూరల్/నర్సాపూర్/హవేళిఘణాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ లబ్ధిదారులకు సూచించారు. గురువారం మండలంలోని ఎరక్రుంట, రూప్‌సింగ్ తండాలో పర్యటించారు. ఇందిర మ్మ బిల్లులు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామాల్లో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఆర్డీఓ మహిపాల్, ఎంపీఓ వైద్య శ్రీనివాస్, కార్యదర్శి స్వాతిప్రియ ఇతర అధికారులు ఉన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. భూ భారతి దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. ట్రిపుల్‌ఆర్ భూసేకరణను వేగవంతం చేయాలని సూచించారు. రాయరావు చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మెదక్ మండలం కోంటూర్ చెరువును సంద ర్శించారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్