
నష్టపోయిన రైతులను ఆదుకోండి
పాపన్నపేట(మెదక్): వర్షాలతో పంట నష్టపోయిన రైతుకు ఎకరారు రూ. 25 వేలు, మృతిచెందిన వారికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డితో కలిసి మండలంలోని ఎల్లాపూర్, ఆరెపల్లి, కుర్తివాడ, మిన్‌పూర్, ముద్దాపూర్, రామతీర్థం తదితర గ్రామాల్లో దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటీవల వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు కనీసం హెలిక్యాప్టర్ పంపలేకపోయారని విమర్శించారు. వర్షాలతో పెద్దఎత్తున పంట నష్టం జరిగిందని, అయినా అధికా రులు, ప్రజాప్రతినిధులు పట్టించుకున్న దాఖాలా లు లేవన్నారు. యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారని వాపోయారు. ఆమె వెంట మండల పార్టీ అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి, నాయకులు సోములు, జగన్, లింగారెడ్డి, కుబేరుడు, బాబాగౌడ్, కిష్టాగౌడ్, సంజీవరెడ్డి ఉన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి