
ఏడుపాయలలో సందడి
ఏడుపాయలకు ఆదివారం తరలివచ్చిన భక్తులు రాజగోపురంలో అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. సింగూరు నుంచి 76,088 క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో, అమ్మవారి ఆలయం జలదిగ్బధంలో చిక్కుకుంది. దీంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పూజలు చేశారు. పరుగులు తీస్తున్న మంజీరా జలాలను చూస్తూ, భక్తులు ఆనందంగా గడిపారు. ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు. సింగూరు నుంచి ఎక్కువ నీరు విడుదల చేయడంతో ఎల్లాపూర్ వద్ద బ్రిడ్జికి దగ్గరగా మంజీరా ప్రవాహం కొనసాగుతుంది.
– పాపన్నపేట(మెదక్)

ఏడుపాయలలో సందడి