
అప్రమత్తంగా ఉండాలి
మెదక్ కలెక్టరేట్: మంజీరా నదికి వరద పోటెత్తనుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహారాష్ట్రలోని లాతూర్ కర్ణాటకలోని సాయిగాం నుంచి లక్ష క్యూసెక్కుల నీరు వదిలారని తెలిపారు. ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.
నిధులు మంజూరు చేయండి
పాపన్నపేట(మెదక్): మెదక్– బొడ్మట్‌పల్లి రోడ్డుపై అనంతుని వాగు బ్రిడ్జికి ఇరువైపులా శిథిలమైన రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి కోరారు. ఈమేరకు ఆర్‌అండ్‌బీ ముఖ్య అధికారి వికాస్‌రాజ్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. పాపన్నపేట మండలం కొత్తపల్లి వద్ద ఉన్న ఈ బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిందని వివరించారు. ఈ రోడ్డు గుండా నిత్యం 500 వాహనాలు తిరుగుతాయని చెప్పారు.
ఎన్నికలప్పుడే గుర్తొస్తరా.?
హవేళిఘణాపూర్(మెదక్): ఎన్నికలప్పుడు తండాల చుట్టూ తిరిగి ఓట్లడిగే రాజకీయ నాయకులు ధూప్‌సింగ్ తండా ప్రజలను పట్టించుకోలేదని గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జైపాల్‌నాయక్ అన్నారు. శనివారం తండాను పరిశీలించి గిరిజనుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిత్యావసర సరుకులు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రోజులుగా విద్యుత్, తాగునీరు, ఆహారం లేక అల్లాడుతుంటే ఏ అధికారి, ప్రజాప్రతినిధి గానీ పట్టించుకోలేదని మండిపడ్డారు. వెంటనే తండాకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించి రవాణా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో గోపాల్‌నాయక్, శినాయక్, కిషన్, రమేశ్, రంజిత్, బాబు, స్వామినాయక్, కుమార్, శేఖర్, రఘు పాల్గొన్నారు.
దెబ్బతిన్న పంటల పరిశీలన
పాపన్నపేట(మెదక్): మండలంలోని ఆరెపల్లి, ఎల్లాపూర్ గ్రామాల్లో ముంపునకు గురైన పంటలను ఏడీఏ విజయనిర్మల, వ్యవసాయాధికారి నాగమాధురి శనివారం పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మంజీరా తీరంలోని పలు ప్రాంతాల్లో పంటలు మునిగాయని తెలిపారు. తమ సిబ్బందితో కలసి ఆయా గ్రామాల్లో నష్టపోయిన పంటల వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. నీరు నిల్వ ఉన్న పొలాల్లో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్‌సెల్ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ఏఈఓలు జనార్దన్, అభిలాష్, ఆసిఫ్, రైతులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
తూప్రాన్: మండల పరిషత్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో జెడ్పీ సీఈఓ ఎల్ల య్య శనివారం సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, ఇండ్లు, విద్యుత్ తీగలు వంటి వాటికి సకాలంలో స్పందించి సహాయ సహకారాలు అందించినందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సమీకృత భవనాన్ని పరిశీలించారు. సమావేశంలో ఆర్డీఓ జయచంద్రారెడ్డి, పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి