
అంధకారంలో పీహెచ్‌సీ
మనోహరాబాద్(తూప్రాన్): ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మూడు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాలకు పీహెచ్‌సీ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో విద్యుత్ ప్రసారం అందించే కేబుల్ సమస్యతో విద్యుత్ సరఫరా కావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవీందర్‌నాయక్ పీహెచ్‌సీని సందర్శించి రికార్డులు పరిశీలించారు. చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా విద్యుత్ అంతరాయం గురించి వైద్యులు ఆయన దృష్టికి తీసుకెళ్లలేదు. మూడు రోజులుగా విద్యుత్ లేకున్నా పట్టించుకోకపోవడంపై రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.