
జాగ్రత్తలు తప్పనిసరి: ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలో ఏర్పా టు చేసిన పలు వినాయక మండపాలను ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శనివారం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమజ్జనం, ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలపై వారికి సూచనలు అందించారు. ప్రజలు శాంతి, సోదరభావంతో పండుగలు జరుపుకోవాలని, పోలీస్‌శాఖ అన్నివిధాల సహకారం అందిస్తుందని తెలిపారు. అంతకుముందు మె దక్ మండలం కొంటూర్ చెరువులో నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్‌రాజ్‌తో కలిసి పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.