
జలదిగ్బంధంలో తండాలు, కాలనీలు
నేలమట్టమైన గుడిసెలో సామగ్రిని తీసుకుంటున్న మహిళ
రామాయంపేట మండలంలో కేవలం 6 గంటల వ్యవధిలో 20 సెం.మీ. వర్షం కురిసింది. సదాశివనగర్ తండా నాలుగు రోజులుగా జల దిగ్బంధంలోనే చిక్కుకుంది. అటవీ ప్రాంతంలో ఉన్న తండాకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. తండాలో ఇద్దరు గర్భిణు లు ఉన్నట్లు సమాచారం. రామాయంపేటలోని అక్కల బస్తీ, శ్రీనగర్‌కాలనీ వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి నీరు చేరి బుర దమయంగా మారాయి. తిండి గింజలు తడిసిపోయాయి. పాపన్నపేట మండలం రాజ్యా, కశ్నా, రుగ్యా, జైరాం, పోంలా తండాల మధ్య ఉన్న కుంట కట్టకు గండి పెట్టడంతో, బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పలు చోట్ల ఇళ్లుకూలి పోయాయి. పంటలు నీట మునిగాయి. చిన్నశంకరంపేట మండలం నార్సింగి నుంచి శేరిపల్లి వరకు గన్నేరు కుంట పొంగి పొర్లడంతో పంటలు నాశనమయ్యాయి. నార్సింగి వద్ద జాతీయ రహదారి ధ్వంసమైంది. టీ.మందాపూర్ వాసులను వరద భయంతో పండగ పూట సహాయక శిబిరంలో ఉంచారు. మెదక్ పట్టణంలోని గాంధీనగర్‌లో ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. పోచారం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందనే భయంతో అధికారులు సర్దన గ్రామస్తులను మెదక్‌లోని సహాయక శిబిరాలకు తరలించారు.
ఇంకా ముంపులోనే రామాయంపేట శ్రీనగర్ కాలనీ

జలదిగ్బంధంలో తండాలు, కాలనీలు