
బిడ్డలను తీసుకొచ్చేందుకు వెళ్లి..
రాజ్‌పేటకు చెందిన బెస్త సత్యనారాయణ, దామరంచ యాదాగౌడ్ ప్రాణ స్నేహితులు. హాస్టల్‌లో ఉంటున్న తమ బిడ్డలను వినాయక చవితికి ఇంటికి తీసుకొచ్చేందుకు మెదక్ బయల్దేరారు. మార్గమధ్యలో వరద ముంచెత్తడంతో చిక్కుకున్నారు. కొద్దిసేపు ఆటోను అడ్డం పెట్టుకొని జీవన పోరాటం చేశారు. వరద ఉధృతికి అది కాస్తా కొట్టుకుపోగా, పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఆసరాగా చేసుకొని, కుటుంబీకులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులు హెలిక్యాప్టర్ కోసం ప్రయత్నాలు చేశారు. కానీ వాతావారణ అనుకూలించకపోవడంతో సాధ్యం కాలేదు. చివరి క్షణం వరకు ప్రయత్నించిన స్నేహితులు చివరకు, అందరి కళ్లేదుటే ఒక్కసారిగా నీటిలో కొట్టుకుపోయారు.

బిడ్డలను తీసుకొచ్చేందుకు వెళ్లి..