
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తిప్పలు
హవేళిఘణాపూర్(మెదక్): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 3 కోట్లు మంజూరు చేసి రూ. 80 లక్షలతో 40 శాతం పూర్తి చేసిన పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్‌ఓసీ ఇవ్వకపోవడంతో పనులు జరుగక తండా వాసులు ఇబ్బంది పడ్డారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆరోపించారు. శని వారం మండల పరిధిలోని ధూప్‌సింగ్ తండాను పరిశీలించారు. తండావాసుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాలు మారినా ప్రజ ల ఇబ్బందులు తీర్చాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంటుందన్నారు. చేసిన పనులకు కాంట్రాక్టర్ కు ఎన్‌ఓసీ ఇవ్వడంలో తాత్సారం చేయడం వల్లే ఈ దయనీయ పరిస్థితి ఏర్పడిందన్నారు. బ్రిడ్జి పనులు పూర్తి చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అలాగే పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాడ్ చేశారు. ఆమె వెంట లావణ్యరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ యామిరెడ్డి, మేకల సాయిలు, చెన్నాగౌడ్, సిద్దిరాంరెడ్డి, భిక్షపతి, సతీశ్‌రావు, బాల్‌రాజ్, రాంచంద్రారెడ్డి, రవీందర్‌గౌడ్, సాప సాయి లు, శ్రీనునాయక్, రంజిత్, తరుణ్ ఉన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి