
శునకం.. ఇక కంట్రోల్
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు
● ఏబీసీ కేంద్రాలకు కుక్కల తరలింపు ● జిల్లాలో ఇప్పటికే 2,810 వాటికి పూర్తి ● మిగతా వాటికి కు.ని. చేసేందుకు చర్యలు
జిల్లాలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది.
గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తూ
కనిపించిన వారిపైన దాడులకు పాల్పడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, మహిళలైతే మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల శివ్వంపేట మండలం రూప్లా తండాలో మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి హతమార్చాయి. కాగా వీటిని అరికట్టే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. కుక్కల సంతానోత్పత్తిని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది.
– రామాయంపేట(మెదక్)
జిల్లాలోని మెదక్, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీల పరిధిలో శునకాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇవి తరచూ ప్రజలు, పశువులపై దాడులకు దిగుతూ భయాందోళన సృష్టిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలతో ప్రభు త్వం వీటి నియంత్రణపై దృష్టి సారించింది. శస్త్ర చికిత్స ద్వారా వాటి సంతానోత్పత్తిని నియంత్రించే విషయమై మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రమైన మెదక్‌లో గతేడాది ఏబీసీ (ఎనిమల్ బర్త్ కంట్రోల్) కేంద్రం ఏర్పాటు చేసింది. ఈమేరకు హైదరాబాద్‌కు చెందిన ఓ ఏజెన్సీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. మెదక్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీల పరిధిలోని వీధి కుక్కలకు మెదక్ కేంద్రంలో, తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో గల శునకాలకు హైదరాబాద్‌లోని బ్లూకాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏబీసీ కేంద్రంలో శస్త్ర చికిత్స నిర్వ హిస్తున్నారు. ప్రతి రోజు కనీసం 20 శునకాలకు శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీల పరిధిలో పట్టుకున్న కుక్కలను వాహనంలో మెదక్ తరలించి, కేంద్రంలోని ప్రత్యేకంగా నిర్మించిన బోనులో ఒక రోజు ఉంచుతున్నారు. ఎలాంటి వ్యాధులు లే వని నిర్ధారించుకున్న అనంతరం శస్త్రచికిత్స చేస్తున్నారు. ఆపరేషన్ తర్వాత నాలుగైదు రోజులు పర్యవేక్షణలో ఉంచిన అనంతరం యాంటీ రేబిస్, నట్ట ల నివారణ, వ్యాక్సిన్, నొప్పి నివారణ మందులు, తగిన ఆహారం అందజేస్తున్నారు. శస్త్ర చికిత్స అనంతరం వాటిని ఎక్కడి నుంచి పట్టుకెళ్లారో అక్కడే మళ్లీ విడిచిపెడుతున్నారు. జిల్లా పరిధిలోని నా లుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 5,000 వేలకు పైగా వీధి కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే సుమారు 2,810కు పైగా శునకాలకు శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఏజెన్సీ బాధ్యులు తెలిపారు.
మున్సిపాలిటీ వీధి కుక్కల సంఖ్య శస్త్రచికిత్స
మెదక్ 2,400 1,500
నర్సాపూర్ 1,050 750
రామాయంపేట 970 260
తూప్రాన్ 650 300
నియంత్రణకు మేలైన పద్ధతి
వీధి కుక్కలకు శస్త్రచికిత్స చేసి సంతానాన్ని నియంత్రించడం మేలైన పద్ధతి. వార్డుల్లో శునకాల బెడద ఉన్నచోట నుంచి వాటిని పట్టుకెళ్లి ఆపరేషన్లు నిర్వహించిన అనంతరం మళ్లీ అక్కడే వదిలి వెళ్తారు. దీంతో చాలా వరకు కుక్కల బెడద తగ్గుతుంది.
– దేవేందర్, మున్సిపల్ కమిషనర్,
రామాయంపేట
తూప్రాన్: వీధి కుక్కల దాడిలో చిన్నారులకు తీవ్ర గాయాలైన సంఘటన పట్టణ కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. మరో 20 మంది సైతం గాయపడ్డారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప కాలనీలో వీధి కుక్కల వీరంగం సృష్టించాయి. మూడేళ్ల బాలుడు అనిరుద్, ఎనిమిదేళ్ల రుతిక్‌పై విరుచుకుపడ్డాయి. దీంతో ఇద్దరికి తీవ్ర గా యాలు కాగా, కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా కుక్కల దాడిలో మరో 20 మంది గాయపడ్డారు. వీరు ప్రభు త్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పోందుతున్నారు. శివ్వంపేట మండలంలో జరిగిన ఘటన మరవక ముందే ఇలా చిన్నారు లపై కుక్కల దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది.
గాయపడిన
చిన్నారి అనిరుధ్
గుర్తింపునకు చెవి కత్తిరింపు
శస్త్ర చికిత్స చేసిన శునకాలను గుర్తించడానికి వీలుగా వాటి చెవులను ‘వీ’ ఆకారంలో కత్తిరిస్తున్నారు. కొత్త స్థలాల్లో వాటిని వదిలితే ఇతన శునకాలు దాడి చేసే ప్రమాదం ఉండటంతో అవి కోలుకున్న అనంతరమే విడిచిపెడుతున్నారు. ఆపరేషన్ అనంతరం వాటిలో సాధ్యమైనంత మేర కోపం తగ్గుతుందని, సంతాన వృద్ధి ఆగిపోతుందని వెటర్నరీ డాక్టర్ ఒకరు తెలిపారు.
ఇద్దరు చిన్నారులపై కుక్కల దాడి
మరో 20 మందికి గాయాలు

శునకం.. ఇక కంట్రోల్

శునకం.. ఇక కంట్రోల్

శునకం.. ఇక కంట్రోల్

శునకం.. ఇక కంట్రోల్

శునకం.. ఇక కంట్రోల్