
శాకాంబరిగా సరస్వతీ మాత
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని చిన్న గొట్టిముక్ల అటవీ ప్రాంతంలో వెలిసిన చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తజన సందడి నెలకొంది. స్వామివారికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢమాసం ఆఖరి శనివారం కావడంతో సత్యనారాయణస్వామి మండపంలో కొలువైన సరస్వతీ మాత శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. వివి ధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఈఓ శ్రీనివాస్, ఆలయ చైర్మన్ ఆంజనేయశర్మ, ప్రధాన అర్చకులు దేవాదత్తశర్మ, ప్రభుశర్మ తదితరులు పాల్గొన్నారు.