
అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డు
మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు
పాపన్నపేట/హవేళిఘణాపూర్(మెదక్): అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు హామీ ఇచ్చారు. శనివారం మండల పరిధిలోని అర్కెల గ్రామంలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులు అందజేసి మా ట్లాడారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరు స్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, మండలాధ్యక్షుడు గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే హవేళిఘణాపూర్ రైతు వేదికలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పరశురామ్‌గౌడ్, మండల అధ్యక్షులు శ్రీనివాస్, శ్రీకాంత్, కృష్ణతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.