
దరఖాస్తుల ఆహ్వానం
మెదక్‌జోన్: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోధించేందుకు అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. కామర్స్ 1, కంప్యూటర్ సైన్స్ 4, ఇంగ్లీష్ 3, హిందీ 1, పొలిటికల్ సైన్స్ 1, తెలుగు 3, జీవాలజీ 1 చొప్పున మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 23 సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నల్లపోచమ్మను
దర్శించుకున్న న్యాయమూర్తి
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి నల్లపోచమ్మను నర్సాపూర్ కోర్టు న్యాయమూర్తి హేమలత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం ఆలయానికి న్యాయమూర్తి రావడంతో ఈఓ రంగారావు, ఆలయ పూజారులు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి, కోర్ట్ పీసీలు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
విద్యా ప్రమాణాల
మెరుగే లక్ష్యం: కలెక్టర్
కొల్చారం(నర్సాపూర్): వసతి గృహ సంక్షేమాధికారులు అప్రమత్తంగా ఉండి, విద్యా ప్రమా ణాల మెరుగే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. ఆదివారం మండల కేంద్రంలోని బీసీ బాలుర సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతిగృహంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. స్టోర్ రూం, మరుగుదొడ్ల నిర్వహణ, రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల కోసం తయారుచేసిన ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచాలని, కొత్తగా చేరే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని వార్డెన్ ఉమకు సూచించారు. విద్యతో పాటు క్రీడల్లో రాణించేలా దృష్టి పెట్టాలన్నారు. వసతి గృహంలో ప్రతినెల వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సూచించారు. వసతి గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.
కొండపోచమ్మ
అభివృద్ధికి కృషి
జగదేవ్‌పూర్(గజ్వేల్): కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, అలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కొండపోచమ్మ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. భక్తుల కోసం మంచి నీటి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్ అనుగీత, ఈఓ రవికుమార్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి వివేక్‌ను కలిసిన
కాంగ్రెస్ నేతలు
చిన్నకోడూరు(సిద్దిపేట): రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తుండగా ఆదివారం చర్లఅంకిరెడ్డిపల్లి వద్ద కాంగ్రెస్ నాయకులు కలిశారు. మంత్రిని సన్మానించారు. యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అజ్జు యాదవ్ మండలంలో జరుగుతున్న అభివృద్ధి, తదితర అంశాలను మంత్రికి వివరించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వివరించారు.

దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం