
ప్రజావాణి వాయిదా
మెదక్ కలెక్టరేట్: ఈనెల 21 సోమవారం బోనాల పండగ సందర్భంగా కలెక్టరేట్‌లో ని ర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 28 సోమ వారం యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు.
వెనకబడిన విద్యార్థులపై
శ్రద్ధ వహించాలి
వెల్దుర్తి(తూప్రాన్): చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించడంతో పాటు వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఈఓ రాధాకిషన్ ఉపాధ్యాయులను ఆదేశించారు. మండల కేంద్రం వెల్దుర్తిలోని ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు అంగడిపేట కాలనీలోని ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ యాదగిరితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థుల స్థితిగతులు, కార్యా లయంలోని రికార్డులు పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నూతన అడ్మిషన్లు అంతంత మాత్రంగానే ఉంటున్నాయని, ప్రైవేట్ విద్యార్థులు సైతం ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం ఎంఈఓలు పంపిన ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సాంబయ్య పాల్గొన్నారు.
సాగు నీరు విడుదల
చేయండి
నర్సాపూర్: సింగూరు, కొండపోచమ్మ రిజర్వాయర్ల నుంచి సాగు నీరు విడుదల చేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని కార్యా లయంలో మంత్రిని కలిసి సాగు నీటి సమస్యలను వివరించినట్లు చెప్పారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి హల్దీవాగు ద్వారా వెల్దుర్తి, మాసాయిపేట, కొల్చారం మండలాలకు.. సింగూరు రిజర్వాయర్ నుంచి కొల్చారం మండలంలోని సాగు భూములకు నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.
బీజేపీతోనే అభివృద్ధి
మెదక్‌జోన్: బీజేపీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ అన్నారు. మెదక్‌కు రింగ్‌రోడ్డుతో పాటు మెదక్, వయా నర్సాపూర్ మీదుగా హైదరాబాద్ వరకు నాలుగు లేన్ల రోడ్డు మంజూరు చేసినందున శనివారం ప్రధాని మోదీతో పాటు ఎంపీ రఘునందన్‌రావు చిత్రపటానికి క్షీరాభి షేకం చేశారు. ఈసందర్భంగా మల్లేశంగౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మెదక్ అభివృద్ధికి చేసింది శూన్యం అన్నారు. కార్యక్ర మంలో నాయకులు గడ్డం శ్రీనివాస్, నాయిని ప్రసాద్, బక్కవారి శివ, బెండ వీణ తదితరులు పాల్గొన్నారు.
మిగులు సీట్ల భర్తీకి
స్పాట్ అడ్మిషన్లు
వెల్దుర్తి(తూప్రాన్): వెల్దుర్తి కేజీబీవీలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) మొదటి సంవత్సరం తెలుగు మీడియం కోర్సులో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 22న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ఎస్‌ఓ ఫాతిమా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసక్తి, అర్హత గల వారు పదో తరగతి మార్కుల జాబితా, కు ల, ఆధార్ కార్డు, ఇతర అవసరమైన పత్రాల తో కళాశాలలో సంప్రదించాలని సూచించారు.

ప్రజావాణి వాయిదా

ప్రజావాణి వాయిదా