రామాయంపేట/నిజాంపేట(మెదక్): ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పంజా విజయకుమార్ శనివారం కాంగ్రెస్‌లో చేరారు. ఈమేరకు హైదరాబాద్‌లోని పంజా విజయకుమార్ ఇంటికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ఆయనతో చర్చించి పార్టీలో కి ఆహ్వానించారు. అనంతరం కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ర్యాగింగ్ భూతాన్ని తరిమేద్దాం
నర్సాపూర్ రూరల్: ర్యాగింగ్ భూతాన్ని తరిమేద్దామని మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి హేమలత సూచించారు. శనివారం నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆమె మాట్లాడుతూ.. ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను వేఽ దించే సంస్కృతి విద్యాలయాల్లో మితిమీరి పోతుందన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ అదెప్ప, యాంటీ ర్యాగింగ్ కమిటీ కన్వీనర్ సమీరా, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సురేష్, అధ్యాపకులు శ్రీనివాస్, రమేష్, రవి, ఆరిఫ్, హేమంత్ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లోకి పంజా విజయకుమార్