
భారీ వర్షం.. రోడ్లు జలమయం
రామాయంపేట పట్టణంలో శుక్రవారం రాత్రి, శనివారం భారీ వర్షం కురిసింది. రాత్రి ఏకంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లపై వరద నీరు పోటెత్తి వీధులు జలమయం అయ్యాయి. అక్కలగల్లీలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీవాసులు అవస్థలు పడ్డారు. సిద్దిపేట, కామారెడ్డి వైపు రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అలాగే నర్సాపూర్‌లో భారీ వర్షం కురిసింది. విఘ్నేశ్వర కాలనీలోని రోడ్డుపై నుంచి వర్షం నీరు పారడంతో కాలనీవాసులు ఇబ్బందుల పాలయ్యారు. – రామాయంపేట(మెదక్)/నర్సాపూర్

భారీ వర్షం.. రోడ్లు జలమయం