నకిలీ పత్తి విత్తనాలపై ప్రత్యేక నిఘా
డివిజన్ల వారీగా టాస్క్‌ఫోర్స్ కమిటీలు
సంగారెడ్డి జోన్: రైతులు నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నకిలీ విత్తనాలు తయారీ దారులతో పాటు సరఫరాను అడ్డుకోవడం, అమ్మకాలు జరగకుండా ఉండేందుకు అధికారులు గట్టి నిఘాను ఏర్పాటు చేయనున్నారు. రైతులకు తక్కువ ధరకు విత్తనాల ఆశ చూపి విక్రయిస్తుంటారు. వాటిని సాగు చేసిన తర్వాత మొలకెత్తకపోవడంతో పాటు దిగుబడి తగ్గిపోయి మోసపోతుంటారు. నకిలీ విత్తనాలు, నాణ్యతలేని విత్తనాలపై తనిఖీలు చేసేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాకు ఒకటి, ప్రతి డివిజన్ వారీగా టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విత్తనాల విక్రయ దుకాణాలలో తనిఖీలు చేపడుతారు.


