ధాన్యాన్ని దళారులకు విక్రయించొద్దు
ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి
పెద్దశంకరంపేట(మెదక్): రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించొద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేట మండలం కమలాపూర్, శివాయిపల్లి, బూర్గుపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్ శ్రీనివాస్, ఏఈఓలు అఖిల్, వినీత్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మధు, నాయకులు నారాగౌడ్, రాములు, శ్రీను, సంగమేశ్వర్,సుభాష్‌గౌడ్, జనార్దన్, పెరుమాండ్లుగౌడ్, సత్యనారాయణరావు, భానుగౌడ్, గోవింద్‌రావు, వెంకటరావు, ఏపీఎం గోపాల్ తదితరులున్నారు.


