
ఒంటి పూట బడులు
శుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025
● రేపటి నుంచి అమలు ● ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ● యథావిధిగా మధ్యాహ్న భోజనం
పాపన్నపేట(మెదక్): వేసవికాలం.. పైగా ఎండల తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో శనివారం నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులను నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి. పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్న పాఠశాలల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. అందుకు అను గుణంగా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు అందాయి. జిల్లావ్యాప్తంగా 1,067 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, వాటిలో 1. 23 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కాగా ఒంటి పూట బడులు నిర్వహించనున్న నేపథ్యంలో యథావిధిగా మధ్యాహ్న భోజనం కొనసాగనుంది. అందుకు గాను విద్యాశాఖ అధికారులు నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. తరగతులు పూర్తయిన తరువాత మధ్యాహ్న భోజనం అందించి విద్యార్థులను ఇంటికి పంపాలని సూచించారు.
న్యూస్‌రీల్