తక్షణమే రిజర్వేషన్లు అమలు చేయండి | - | Sakshi
Sakshi News home page

తక్షణమే రిజర్వేషన్లు అమలు చేయండి

Mar 10 2025 10:24 AM | Updated on Mar 10 2025 10:21 AM

మెదక్‌ కలెక్టరేట్‌: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్‌ కడారి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణంలోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జిల్లా సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పని ప్రదేశాల్లో రక్షణ కల్పించాలని కోరారు. ప్రభుత్వాలు మారిన మహిళల బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ప్రోత్సహించి మరింత ముందుకు నడిపించాలన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లలపై లైంగిక దాడులు, హింస పెరిగిపోయిందన్నారు. మహిళా కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు యశోద, కవిత, స్వరూప, కవిత, రేణుక, రాణి, వరలక్ష్మి, వీరమణి, రమాదేవి, మంజుల, లక్ష్మీసుజాత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

మూల్యాంకన పారితోషికం ఏది: పీఆర్టీయూ

మెదక్‌ కలెక్టరేట్‌: గతేడాది పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనం బిల్లులు వెంటనే చెల్లించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుంకరి కృష్ణ, స్వామ్యనాయక్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. గత సంవత్సరం 10వ తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనం చేసిన ఉపాధ్యా యులకు ఇంతవరకు పారితోషికం చెల్లించకపోవడం శోచనీయమన్నారు. ఈసంవత్సరం మళ్లీ 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని, అయినా ఇప్పటివరకు చెల్లించకపో వడం ఏమిటని ప్రశ్నించాడు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే గత సంవత్సరం మూల్యాంకనం పారితోషికాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు.

విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యం

నారాయణఖేడ్‌: తమ ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. సిర్గాపూర్‌ మండలం సంగం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రావుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.(60 వేలు మంజూరుకాగా అందుకు సంబంధించిన చెక్కును ఆదివారం ఆయన ఖేడ్‌లోని తననివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...వైద్యరంగానికి ప్రాధాన్యతలో భాగంగా ఆరోగ్యశ్రీ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచిందన్నారు. కాగా, మనూరు మండలం దన్వార్‌ గ్రామంలో నిర్వహించిన బీరప్ప జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యా యి. జాతర ఉత్సవాల్లో పాల్గొన్న సంజీవరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు భోజిరెడ్డి, మాజీ సర్పంచ్‌ దిగంబర్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

సీఐటీయూతోనే

కార్మికులకు న్యాయం

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు

పటాన్‌చెరు టౌన్‌: కార్మికుల కష్ట సుఖాల్లో ఎరజ్రెండా అండగా ఉంటుందని, సీఐటీయూ అంటేనే కార్మికులకు ఒక భరోసా అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, కిర్బీ యూనియన్‌ అధ్యక్షుడు చుక్కా రాములు పేర్కొన్నారు. పటాన్‌చెరు పట్టణంలోని శ్రామిక భవన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాలకు చెందిన కార్మికులు సీఐటీయూలో చుక్కా రాములు సమక్షంలో పెద్ద ఎత్తున చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కార్మికులకు అండగా సీఐటీయూ ఉంటుందన్నారు. కిర్బీ పరిశ్రమలో కూడా కార్మికులకు అనేక చట్టపరమైన సౌకర్యాలు సీఐటీయూ సాధించిందని, భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు సాధిస్తామని భరోసానిచ్చారు. కార్మికులందరూ ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజయ్య, యూనియన్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తక్షణమే రిజర్వేషన్లు  అమలు చేయండి 
1
1/1

తక్షణమే రిజర్వేషన్లు అమలు చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement