
సమాజ సేవకు సమయం కేటాయించండి
జహీరాబాద్ టౌన్: ఉన్నతస్థాయిలో ఉన్నా సొంత ఊరిని మర్చిపోకుండా కొంత సమయం సమాజ సేవకు కేటాయించాలని టీబేస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసీరామ్ రాథోడ్ అన్నారు. జహీరాబాద్ డివిజన్ పరిధిలోని మల్చల్మ, విట్టు నాయక్ తండాలకు చెందిన తుకారాం రాథోడ్, శంకర్ చవాన్లు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించగా.. పట్టణంలోని బంజారా భవన్‌లో శనివారం వారిని సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని కొనియాడారు. కష్టపడి చదివించిన తల్లిదండ్రులను, సొంత ఊరిని మర్చిపోవద్దని సూచించారు.
సమస్యల పరిష్కారానికి కృషి
పటాన్‌చెరు: సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నానని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శనివారం అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపీని కలిసి అమీన్‌పూర్‌లో నెలకొన్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పట్టణంలో అంతర్గత రోడ్లు, పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని వివరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ... అమీన్‌పూర్ పరిధిలోని సమస్యలపై తాను ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణం పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో పీపుల్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తిరుమలరెడ్డి, కొండ లక్ష్మణ్, మహేశ్వర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, వెంకట పుల్లారెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.