
మెరుగైన వైద్యం అందించండి
మనోహరాబాద్(తూప్రాన్): ఆస్పత్రికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోజువారీగా ఓపీ ఎలా ఉంటుందని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట వైద్యులు వినోద, సూపర్‌వైజర్ పల్లవి, ఫార్మసిస్ట్ సురేష్‌కుమార్, ఏఎన్‌ఎం మాధవి, శ్రవణ్ ఉన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్