మెదక్‌జోన్: మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నప్పటికీ మెదక్‌లో మాత్రం వెనుకబడి ఉన్నారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అంజలి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు, స్టాఫ్‌నర్స్‌లను ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సోషల్ సర్వీస్ చేయడంలోనూ ముందున్నారని తెలిపారు. త్వరలోనే జిల్లాలో మహిళా కాంగ్రెస్ కమిటీలు వేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మహిళా నేతలు భవాని, అరుణ, బట్టి సులోచన, గోదల జ్యోతి, హరిత, స్వరూప తదితరులు పాల్గొన్నారు.