కౌడిపల్లి(నర్సాపూర్): చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా ఇష్టంతో చదవాలని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. గురువారం మండలంలోని తునికి ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కిచెన్, స్టోర్‌రూం, నిత్యావసర సరుకులు, విద్యార్థులకు పె ట్టిన భోజనం పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి మాట్లాడారు. చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుందని వివరించారు. పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు భయపడవద్దని, శ్రద్ధగా చదవితే వందశాతం ఫలితాలు వస్తాయన్నారు. ఉపాధ్యాయులు ఎప్పటికప్పడు గమనించి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎల్‌పీఓ సాయిబాబా, ప్రిన్సిపాల్ హరిబాబు, ఏటీపీ సుష్మ, జయరాజ్, డిప్యూటీ వార్డెన్ లక్ష్మణ్, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నగేష్