
పోటీలను పరిశీలిస్తున్న డీఈఓ రాధాకిషన్
హవేళిఘణాపూర్(మెదక్): విద్యార్థులు పోటీ పడి చదివితే మంచి భవిష్యత్ ఉంటుందని డీఈఓ రాధాకిషన్ అన్నారు. శనివారం మండల స్థాయిలో నిర్వహించిన క్విజ్, చిత్రలేఖనం,తెలుగు, ఇంగ్లీష్ భాషలపై పఠనం తదితర వాటిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. భవిష్యత్‌లో విద్యార్థుల ఉన్నతికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలన్నా రు. మండల స్థాయి ప్రతిభా పోటీలు నిర్వహించిన ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓ మధుమోహన్, ఏఎంఓ సుదర్శనమూర్తి, కరుణాకర్, నాగుల్ మీరా మండలంలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు