Telangana News: మేం 'తెలంగాణ బిడ్డలం' కాదా..? మరెందుకు మాపై ఇలా..
Sakshi News home page

మేం 'తెలంగాణ బిడ్డలం' కాదా..? మరెందుకు మాపై ఇలా..

Aug 17 2023 6:20 AM | Updated on Aug 17 2023 10:47 AM

- - Sakshi

మెదక్‌: మేం తెలంగాణ బిడ్డలం కాదా? అందరినీ రెగ్యులరైజ్‌ చేస్తున్న సీఎం కేసీఆర్‌ 15 నుంచి 20 ఏళ్లుగా రోగులకు సేవలందిస్తున్న తమను ఎందుకు పట్టించుకోవడం లేదని సెకండ్‌ ఏఎన్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు తన్వీర్‌ మాట్లాడుతూ.. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో కొందరిని, వీఆర్‌ఏలను రెగ్యులరైజ్‌ చేసిన సీఎం తమను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. ఎప్పటికైనా రెగ్యులరైజ్‌ అవుతుందన్న ఆశతో ఉన్నామని, కొత్తగా నోటిఫికేషన్‌ వేసి తమ కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. 15 రోజులుగా ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం స్పందించక పోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో తులసి, సంగీత, సులోచన, రమ్య, యాదమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement