సీఎం పర్యటనలో మార్పు | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనలో మార్పు

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

● 2న కుమురంభీం జిల్లాకు రేవంత్‌రెడ్డి

● 2న కుమురంభీం జిల్లాకు రేవంత్‌రెడ్డి

ఆసిఫాబాద్‌/కై లాస్‌నగర్‌: ఉమ్మడి ఆదిలాబా ద్‌ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో మా ర్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్‌ జిల్లాకు వస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ జూన్‌ 2న సీఎం కుమురంభీం ఆసిఫాబా ద్‌ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఉమ్మడి జి ల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గడ్డం వివేక్‌ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు బుధవారం కుమురంభీం ఆసిఫా బాద్‌ జిల్లాలో సీఎం పర్యటన ఏర్పాట్లను ప ర్యవేక్షిస్తారని మంత్రి ప్రత్యేక కార్యదర్శి కాసు ల నానిల్‌కుమార్‌ తెలిపారు. మంత్రులు మ ధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్‌లోని బే గంపేట నుంచి హెలికాప్టర్‌లో ఆసిఫాబాద్‌ క లెక్టరేట్‌కు చేరుకోనున్నారు. బహిరంగ సభ నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2.15నుంచి సాయంత్రం 4.45వరకు కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షిస్తారు. అ నంతరం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో మంగళవారం క లెక్టర్‌ హరిత, ఎస్పీ నితికా పంత్‌, ఎమ్మెల్సీ దండె విఠల్‌ కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌, వంజిరీ దాదానగర్‌ ప్రాంతాలు పరిశీలించారు. సీఎం ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం, అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement