నెన్నెల: నార్వాయిపేట యూనిట్‌లోని జెండావెంకటాపూర్, మెట్‌పల్లి, నార్వాయిపేట తునికాకు కల్లాలను మంగళవారం బెల్లంపల్లి ఎఫ్‌డీవో విజయ్‌కుమార్, బెల్లంపల్లి రేంజ్ అధికారి పూర్ణచందర్‌తో కలిసి తనిఖీ చేశారు. కాంట్రాక్టర్, తునికాకు సేకరణ సిబ్బందితో సలహాలు, సూచనలు చేశారు. తునికాకు నా ణ్యతగా ఉండేలా తేమ లేకుండా ఆరబెట్టాల ని, కూలీలకు గిట్టుబాటు ధర అందేలా చూ డాలని సూచించారు. అకాల వర్షాలకు ఆకు తడిసి పోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండా భద్రత చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. నేరుగా కూలీల ఇళ్లకు వెళ్లి నాణ్యమైన ఆకు సేకరించాలని సూచించారు. ఉపాధి, గిట్టుబాటు ధర లభిస్తుందా? అని ఆరా తీశారు. ఆకు సేకరణ సమయంలో ప్రమాదాలకు గురైతే ప్రమాద బీమా ఉంటుందని చెప్పారు. ఆయన వెంట నార్వాయిపేట ఎఫ్‌ఎస్వో శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.


