దిగుమతి వేగంగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

దిగుమతి వేగంగా చేపట్టాలి

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

దండేపల్లి/జైపూర్‌/లక్సెట్టిపేట/శ్రీరాంపూర్‌: రైస్‌ మిల్లులకు తరలించిన ధాన్యాన్ని వేగంగా దిగుమతి చేయాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ సూచించారు. మంగళవారం జిల్లాలోని జైపూ ర్‌ మండలం ఇందారంలో సుముఖ గోదాం, జయలక్ష్మి రైస్‌మిల్లు, సీసీసీ నస్పూర్‌లోని గో దాములు, దండేపల్లి మండలం కన్నెపల్లిలోని రైస్‌మిల్లులు, లక్సెట్టిపేట మండలం లక్ష్మిపూ ర్‌, వెంకట్రావుపేట గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలు సందర్శించారు. ఆయన మాట్లాడు తూ అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా గోదాములు, రైస్‌మిల్లులకు తరలిస్తున్నట్లు తె లిపారు. అవసరం మేరకు హమాలీల సంఖ్య పెంచుకోవాలని, రోజుకు 10నుంచి 15లారీ ల ధాన్యం దిగుమతి చేసుకునేలా చర్యలు తీ సుకోవాలని అన్నారు. ఆయా మండలాల త హసీల్దార్లు వనజారెడ్డి, దిలీప్‌కుమార్‌, రోహిత్‌దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement