మూడేళ్లు దాటితే స్థాన చలనం
31లోపు ప్రక్రియ పూర్తికి చర్యలు
ఏళ్లుగా జిల్లాలో పలువురి తిష్ట
తప్పించుకునేందుకు పైరవీలను
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సాధారణ బదిలీల్లో కొందరు ప్రభుత్వ అధికారులు తెరవెనుక మంతనాలు సాగిస్తున్నారు. రాజకీయంగా పైరవీలు చేసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి ఒకటి వరకు జి ల్లాలో పని చేస్తూ మూడేళ్లు పూర్తయినవారికి స్థాన చలనానికి అవకాశముంది. ఇక నాలుగేళ్లు ఒకేచోట సర్వీస్ పూర్తయితే తప్పనిసరిగా బదిలీ చేయాలి. జి ల్లాలో సుమారు 4వేల మంది వరకు వివిధ కేడర్‌లో పని చేస్తున్న ఉద్యోగులున్నారు. వీరిలో రాష్ట్ర, మల్టీ, జోనల్, జిల్లా స్థాయి పోస్టుల్లో ఉన్నారు. యూని ఫాం ఉద్యోగులైన పోలీస్, ఆబ్కారీ, అటవీ, అగ్ని మాపక, రవాణాశాఖ అధికారులు మిన హా ఇతర శాఖల సిబ్బందికి స్థానం చలనం జరుగుతోంది.
ఈ నెలాఖరులోపు ప్రక్రియ పూర్తి చేసేలా..
ఈ నెల ఒకటి నుంచి 31వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి. వచ్చే నెల 3వ తేదీ లోపు బదిలీ జరిగిన స్థానాల్లో వారంతా విధుల్లో చేరాలి. ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు నోడల్ ఆఫీసర్లుగా రాష్ట్ర, మల్టీ జోన్, జిల్లా స్థాయి ఆ శాఖల్లోని ఉన్నతాధికారులతో కమిటీలు నియమించారు. వచ్చే జూన్ ఒకటి నుంచి మళ్లీ బదిలీ లపై నిషేధం అమలు కానుంది. ఈ లోపు నిబంధనల మేరకు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. శాసనసభ, పార్లమెంట్, గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు బదిలీలు జరిగాయి. తాజాగా మళ్లీ సాధారణ బదిలీల్లో భాగంగా అధికారులకు స్థాన చలనం కలగనుంది. ఉద్యోగులు మొత్తం ఐదు చోట్ల ప్రాధాన్యత క్రమంలో బదిలీ స్థానంపై ఎంపిక చేసుకునే అవకాశముంది.
ఏళ్లుగా కొందరు అధికారుల తిష్ట
వివిధ కారణాలతో జిల్లాలో కొందరు ఆఫీసర్లు ఏళ్లుగా తిష్ట వేశారు. నాలుగో తరగతి నుంచి గెజిటెడ్ ఆీ ఫసర్ హోదాలో ప్రమోషన్లు పొందుతున్నా ఇక్కడే ఉంటున్నట్లు సహోద్యోగులే చెబుతున్నారు. కొందరు మారుమూల ప్రాంతాల్లోనే విధులు నిర్వహిస్తుండగా, మరికొందరు జిల్లా కేంద్రం, పట్టణాల్లోనే బదిలీ అవుతున్నారు. ఇక కొందరు ఏళ్లుగా తిష్టవేస్తూ పలు కారణాలు చూపుతూ ఆయా శాఖల్లో ప ట్టు పెంచుకున్నారు. దీంతో అర్హులకు బదిలీల్లో నష్టం జరుగుతోందని ఉద్యోగులు వాపోతున్నారు.
నమ్ముకున్న కొందరు అధికారులు!
కోరుకున్న చోట ఉండేలా ప్రణాళిక!
బదిలీల్లో కొందరు తెలివిగా తాము కోరుకున్న చోట ఉండేలా ప్రణాళిక వేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులకు బదిలీల్లో ఇద్దరికి మినహాయింపు ఉంటుంది. అధ్యక్ష, కార్యదర్శి వర కు అవకాశం కలిగినప్పటికీ కొందరు ఆఫీస్ బే రర్ కోటాలో ఆ ఆప్షన్ ఎంచుకున్నట్లు సమాచా రం. జిల్లా విద్యాశాఖలో నాన్ టీచింగ్‌లో ఓ ఉ ద్యోగి ఈ మినహాయింపు వాడుకుని బదిలీని తప్పించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న ట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు అనారో గ్యం, వైకల్యం, స్పౌజ్ కోటా చూపిస్తూ జిల్లాలోనే కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది మే 31వరకు రిటైర్డయ్యేవారికి మినహాయింపు ఇ వ్వాలి. ఇక జనగణనలో విధుల్లో ఉన్న టీచర్లకు మినహాయింపు ఉండగా, నాన్ టీచింగ్ ఉద్యోగులకు బదిలీలు జరగనున్నాయి. ఇక కొన్ని శాఖల్లో ఆన్‌లైన్‌లో కాకుండా మాన్యువల్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బదిలీల్లో మొత్తం ఆ శాఖల్లో నిర్వహణకు ఇబ్బంది కలగకుండా కనీసం 40శాతం మించకుండా బదిలీ చేయరాదు. దీంతో ఆ కేడర్ ఉద్యోగులు జిల్లాకు ట్రాన్స్‌ఫర్ కాకపోయినా సర్వీస్ నిండినా, అక్కడే పని చేయాల్సి వస్తోంది.


