అనుమతి లే.. అవుట్‌! | - | Sakshi
Sakshi News home page

అనుమతి లే.. అవుట్‌!

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

● జోరుగా ‘రియల్‌’ వెంచర్లు ● నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు ● ప్రభుత్వ భూముల నుంచి మట్టి తరలింపు ● వ్యవసాయ భూమిలో లే అవుట్‌ చేయాలంటే మొదట భూమి విలువలో మూడు శాతం రుసుము రెవెన్యూ శాఖకు చెల్లించి నాలా(వ్యవసాయేతర భూమి)గా మార్చుకోవాలి. ఆ తర్వాత డీటీసీపీ ద్వారా అనుమతులు పొంది లే అవుట్‌ చేయాల్సి ఉంటుంది. ● పట్టణాల్లో మున్సిపాలిటీ, గ్రామాల్లో పంచాయతీల అనుమతి తీసుకోవాలి. జిల్లా స్థాయిలో డీటీసీపీ నుంచి లే అవుట్‌ అనుమతి తీసుకోవాలి. ● వెంచర్‌లో పది శాతం ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీలకు అప్పగించాల్సి ఉంటుంది. ● వీధి దీపాలు, మురికి కాలువలు, రహదారుల ఏర్పాటు, విద్యుత్‌ సౌకర్యం, నీటి ట్యాంకు నిర్మాణం ఇలా తదితర అభివృద్ధిని వెంచర్‌ నిర్వాహకులు చేపట్టాల్సి ఉంటుంది. ఇవేవీ పాటించకుండానే వెంచర్లు ఏర్పాటు కావడం గమనార్హం.

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మరోసారి జోరు పెరిగింది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అనుమతి లేకుండానే భూమి ప్లాట్లుగా మారుతోంది. అనధికార లే అవుట్‌ స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేస్తున్నా వ్యాపారం సాగుతోంది. మంచిర్యాల నగరంలోని వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట, నంనూర్‌, నర్సింగాపూర్‌, హాజీపూర్‌ మండలం రాపల్లి, హాజీపూర్‌, దొనబండ గ్రామాల శివారు ప్రాంతాల్లో వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా వెంచర్లకు ప్రభుత్వ భూముల నుంచి పెద్దయెత్తున మట్టి తరలిస్తుండడం గమనార్హం. నాలా కన్వర్షన్‌ చేసిన మీదట లే అవుట్‌ అనుమతి వచ్చిన తర్వాత ప్లాట్లతో వెంచర్‌ తయారు చేయాలి. కానీ రియల్‌ వ్యాపారులు ప్రైవేటు ఇంజినీర్లు, సర్వేయర్లతో హద్దురాళ్లు, సిమెంటు స్తంభాలు పాతి గజాల్లో కాకుండా గుంటల చొప్పున ఫామ్‌ ల్యాండ్స్‌ పేరుతో విక్రయిస్తున్నట్లు సమాచారం. పంచాయతీ, బల్దియాలకు కేటాయించిన పది శాతం భూమిని కూడా మిగుల్చుకుని విక్రయిస్తున్నారు.

నిబంధనలు ఇలా..

గుడిపేటలో అనుమతిలేని వెంచర్‌లోని

హద్దురాళ్లను తొలగిస్తున్న కార్పొరేషన్‌ సిబ్బంది

Advertisement
 
Advertisement
Advertisement