మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

● మేదరిపేటలో బంధువుల రాస్తారోకో ● ఇరువైపులా స్తంభించిన రాకపోకలు

దండేపల్లి: మండలంలోని మేదరిపేట పెట్రోల్‌ బంక్‌ సమీపంలో గత మార్చి 9న విద్యుత్‌ ప్రమాదంలో వెల్గనూర్‌కు చెందిన నాగరాజు, మాదాపూర్‌కు చెందిన లక్ష్మీనారాయణ మృతి చెందగా వారి కుటుంబాలకు న్యాయం చేయాలని మేదరిపేటలో మంగళవారం రాస్తారోకో చేశారు. మృతుల కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బంక్‌ యజమాని మామ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరి గిందని ఆరోపించారు. ప్రమాద సమయంలో పరి హారం ఇస్తానని బాండ్‌ రాసిచ్చి రెండు నెలలైనా ఇవ్వడంలేదని ఆరోపించారు. వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సుమారు 3గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. దండేపల్లి, లక్సెట్టిపేట, జన్నారం ఎ స్సైలు తహసీనొద్దీన్‌, సురేశ్‌, ఉదయ్‌కిరణ్‌ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పా రు. కాగా, వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ఆందోళనకారులు రాస్తారోకో విరమించి బంక్‌ య జమాని ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకుని వారిని రోడ్డుపక్కన కూర్చోబెట్టారు. ఇంతలో మంచిర్యాల ఏసీపీ ప్రకా శ్‌ వచ్చి బాధిత కుటుంబీకులు, బంధువులతో మా ట్లాడారు. బంక్‌ యజమానితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement