భీమారం: నకిలీ పత్తి విత్తనాల కేసులో తాండూర్ మండల కేంద్రానికి చెందిన సుబ్బారావును మంగళవారం భీమారంలోని ఆవిడం ఎక్స్‌రోడ్డు వద్ద అరెస్ట్ చేసినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమారంకు చెందిన పెన్కుల రవి వద్ద రెండు రోజుల క్రితం భారీగా పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి చేసినట్లు తెలిపారు. ఇదే కేసులో కీలక నిందితునిగా ఉన్న సుబ్బారావు పరారీలో ఉండగా అతని కోసం గాలిస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు. ఇదే కేసులో మరొకరు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయించినా నిల్వ చేసినా అరెస్ట్ చేస్తామని ఎస్సై హెచ్చరించారు.
వివరాలు వెల్లడిస్తున్న ఎస్సై రాజేందర్


