ఉల్లాసంగా.. ఉత్సాహంగా | - | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

నెన్నెల: వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో పిల్లలు బయట ఆడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులు చెట్ల నీడన చేరి క్రికెట్‌, తదితర క్రీడలు ఆడుతూ ఉత్సాహంగా వేసవి సెలవులు గడిపేస్తున్నారు. ఎండకు ఆడే ఆటలను పక్కన బెట్టి చెట్టు నీడన ఆడే ఆటలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వేసవి సెలవులకు అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి వచ్చిన పిల్లలను ఎండ తీవ్రత దృష్ట్యా బయటకు వెళ్లకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంగళవారం వేప చెట్టు నీడన చిన్నారులు క్రికెట్‌ ఆడుతుండగా ‘సాక్షి’ కెమెరాలో బంధించింది.

Advertisement
 
Advertisement
Advertisement