ఎండలతో జర పదిలం | - | Sakshi
Sakshi News home page

ఎండలతో జర పదిలం

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

క్రీడాకారులు అప్రమత్తంగా ఉండాలి ఉదయం, సాయంత్రం వేళల్లో ఆటలాడితే మంచిది జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు

ఆదిలాబాద్‌టౌన్‌: ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా హీట్‌వేవ్‌ కారణంగా జనాలు అతలాకుతలం అవుతున్నారు. 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా ఎండ తీవ్రత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా క్రీడాకారులు ఎండ నుంచి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆటలు, వ్యాయామం చేయాలని చెబుతున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, క్రీడా మైదానాల్లో శారీరక శ్రమ ఎక్కువగా చేసే పిల్లలు ఎండ ప్రభావానికి గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించకుంటే వడదెబ్బకు గురయ్యే ప్రమా దం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు జ్వ రం, వాంతులు, విరోచనాల బారిన పడే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు.

జాగ్రత్తలు పాటించాలి..

ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య, సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే ఆటలు ఆడటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తీవ్రమైన ఎండలో ఎక్కువసేపు శారీరక శ్రమ చేయడం ద్వారా డీహైడ్రేషన్‌, హీట్‌ స్ట్రోక్‌, అలసట, తలనొప్పి వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. వి ద్యార్థులు ఆటల సమయంలో త రచూ నీరు తాగాలని, ఓఆర్‌ఎస్‌, కొబ్బరి నీరు, పండ్ల రసాలు తీసుకోవడం మంచి దని చెబుతున్నారు. కాటన్‌ దుస్తులు, టోపీ ధరించడంతో శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుందని పేర్కొంటున్నారు. ఎండలో ఎక్కువసేపు ఉండడంతో తల తిరగ డం, వాంతులు, అధిక చెమటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నీడ ప్రదేశానికి వెళ్లి వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆరో గ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఖాళీ కడుపుతో ఆటలకు పంపించవద్దని, శిక్షకులు విద్యార్థులకు తగిన విరామం ఇవ్వడంతో పాటు తాగునీటి సదుపాయం కల్పించాలని పేర్కొంటున్నారు.

కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు

ఆస్నాదలో క్రికెట్‌ ఆడుతున్న చిన్నారులు

పెరట్లో చిన్నారుల క్రికెట్‌

చెన్నూర్‌రూరల్‌: వేసవి సెలవుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులంతా ఒకేచోట చేరి ఆడుతున్న ఆటలు చూడ ముచ్చటగా ఉంటాయి. అందులోనూ క్రికెట్‌ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంతగానో ఇష్టపడతారు. మండలంలోని ఆస్నాద గ్రామంలో మంగళవారం సాయంత్రం చిన్నారులు తమ ఇంటివద్ద ఉన్న పెరట్లో ఇలా క్రికెట్‌ ఆడుతూ ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు.

ఆటలకు ముందు క్రీడాకారులు వామప్‌ చేసి జాగింగ్‌ చేయడం మంచిది. రన్నింగ్‌ చేసేటప్పుడు తప్పనిసరిగా వామప్‌ చేయాలని క్రీడా నిపుణులు చెబుతున్నారు. లేదంటే నీరసించిపోయి సామర్థ్యం తగ్గుతుందంటున్నారు. ఆయా క్రీడల్లో పాల్గొనే ముందు తప్పనిసరిగా స్టిల్స్‌ ప్రాక్టిస్‌ చేసి గేమ్‌లోకి దిగితే ఎక్కువ సమయం ఆడే అవకాశం ఉంటుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement