బెల్లంపల్లి: వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మండుతున్న ఎండలతో వాహనాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు పొంచి ఉన్నాయి. ఎండలో పార్కింగ్ చేసిన వాహనాలు వేసవి తీవ్రతకు పెట్రోల్ ట్యాంక్ హీటెక్కి మంటలు చెలరేగే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే అక్కడక్కడ బైక్‌లు, కార్లు మంటల్లో కాలిపోయిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 19న ఇచ్చోడ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఇంజిన్‌లోంచి మంటలు చెలరేగి కారు దగ్ధమైన ఘటన చోటు చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో బైక్‌లు, కార్లను నీడపట్టున పార్కింగ్ చేయాలని బెల్లంపల్లికి చెందిన ఓ సీనియర్ మెకానిక్ గౌరు మహేష్ సూచిస్తున్నారు. ఎండలో వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
వాహనాలు భద్రం
May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM
● మండుతున్న ఎండలతో పొంచి ఉన్న ప్రమాదం
● చెట్ల నీడన పార్కింగ్ చేస్తే మేలు
● ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్ల ఎండలో పార్కింగ్ చేసిన 10 నిమిషాల వ్యవధి లోనే బైక్ వేడెక్కుతోంది. అలా హీటెక్కడం వల్ల పెట్రోల్ ట్యాంక్ కూడా వేడెక్కి పెట్రోల్ ఆవిరయ్యేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయి.
● ఒక్కోసారి ఎండ తీవ్రతకు బైక్‌కు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని కాలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి.
● బైక్ ఇంజన్ హీటెక్కిపోవడంతోపాటు టైర్లలో గాలి కూడా తగ్గుతుంది.
● కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన సెన్సార్ బైక్‌లు స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు స్లోగా రన్ అవుతుంది.
● ముఖ్యంగా గంటలకొద్దీ బైక్ ఎండలో ఉండటం వల్ల కలర్ షేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
● ఎండ తీవ్రతకు బైక్ మైలేజీ కూడా తగ్గుతుంది.
● వేసవిలో ఎట్టి పరిస్థితుల్లోనూ బైక్‌లో ట్యాంక్ నిండుగా పెట్రోల్ పోయించవద్దు. కనీసం రెండు లీటర్ల పెట్రోల్ ఉంటే సరిపోతుంది. ట్యాంక్ ఫుల్‌గా చేయించడం వల్ల ట్యాంక్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
● ఎండలోనే కాదు హీటెక్కే అవకాశం ఉన్న రేకుల షెడ్లలోనూ పగటిపూట బైక్ పార్కింగ్ చేయొద్దు.
● కార్లు సాధ్యమైనంతవరకు చెట్ల నీడ పట్టున పార్కింగ్ చేయాలి.
● కార్లు, బైక్‌ల ట్యాంక్ నుంచి పెట్రోల్, డీజిల్ లీక్ కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
● ఎండలో ఎక్కువ సేపు కారు ఉంచడం వల్ల ఇంజిన్, రేడియేటర్ వేడెక్కి సరిగా పనిచేయని పరిస్థితులు ఉన్నాయి.
● కార్లు, బైక్‌లపై ఎండలో గంటలకొద్దీ ప్రయాణం చేయకపోవడం మంచిది.
● చెట్ల నీడ పట్టున వాహనాలను పార్కింగ్ చేయడం అన్ని విధాలా శ్రేయస్కరం.
Advertisement


