చెన్నూర్‌రూరల్: మండలంలోని ఎల్లక్కపేటలో అదనపు కట్నం కోసం మహిళను హత్య చేసిన కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం చెన్నూర్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. మృతురాలు చల్ల శారద భర్త చల్ల రమేశ్ సోమవారం పథకం ప్రకారం అతని స్నేహితుడైన గందం సారయ్యకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నాడు. అతని సహాయంతో భార్య శారదను సుత్తితో తలపై గట్టిగా కొట్టడంతో మృతి చెందింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇద్దరూ పారిపోయి మూతపడిన సింగరేణి క్వార్టర్స్‌లో దాక్కున్నారు. తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన సుత్తిని, రక్తపు మరకలు అంటిన దుస్తులను, సెల్‌ఫోన్‌లు స్వాఽధీనం చేసుకున్నారు. అనంతరం రమేష్ తల్లిదండ్రులు వెంకమ్మ, అబ్బయ్యతో పాటు సోదరి పుష్పలతను అదుపులోకి తీసుకుని చెన్నూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రిమాండ్ నిమిత్తం మంచిర్యాల కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. సమావేశంలో చెన్నూర్ పట్టణ సీఐ బన్సీలాల్, ఎస్సైలు శ్యామ్ పటేల్, రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.


