నస్పూర్: మే నెల 9, 10న హైదరాబాద్‌లోని రవీంద్రభారతీలో నిర్వహించే సైకలాజిస్టుల రాష్ట్ర స్థాయి దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని సైకాలజిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రంగు వేణుకుమార్ కోరారు. బుధవారం ఆయన నస్పూర్‌లోని ప్రకృతి మిత్ర కార్యాలయంలో జిల్లా ముఖ్య బాధ్యులతో సమావేశం నిర్వహించారు. పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 5 నుంచి 10 వరకు జరిగే కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో మానసిక ఆరోగ్యం, జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. సైకాలజిస్టులు, మేధావులు, ప్రజ లు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. రాష్ట్ర బాధ్యులు బి.నారాయణరావు, ముఖ్య సలహాదారులు గుండేటి యోగేశ్వర్, కస్తూరి పద్మచరణ్, బాధ్యులు పప్పుల నాగరాజు, చిందం మొగిలి తదితరులు పాల్గొన్నారు.


