‘అల్ఫోర్స్‌’ విద్యార్థుల ప్రభంజనం | - | Sakshi
Sakshi News home page

‘అల్ఫోర్స్‌’ విద్యార్థుల ప్రభంజనం

Apr 13 2026 7:44 AM | Updated on Apr 13 2026 7:44 AM

గుడిహత్నూర్‌: కుమురంభీం స్టడీ సర్కిల్‌ (కేబీఎస్‌సీ)ను స్థాపించి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం మండలంలోని మాన్కాపూర్‌లోని ఏకలవ్య ఫౌండేషన్‌ గిరిజన వనరుల కేంద్రంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 1999 నుంచి ఇప్పటివరకు ఈ సంస్థ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులంతా ఒకే వేదికపైకి వచ్చి పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేబీఎస్‌సీ వ్యవస్థాపకులు వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఆదివాసీల ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్‌లో ఈ స్టడీ సర్కిల్‌ను స్థాపించినట్లు తెలిపారు. ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌ మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ, కెరీర్‌ గైడెన్స్‌ కీలకమన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్‌ తరాల కోసం స్టడీ సర్కిల్‌శాఖను ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని పూర్వ విద్యార్థులు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ చందు, కౌన్సిలర్‌ ఆత్రం వెంకటేష్‌, సీఈవో మధుకర్‌, డాక్టర్‌ మధుకర్‌, మెస్రం నాగోరావ్‌, కోరింగ శ్రీనివాస్‌, రాజశేఖర్‌ పాల్గొన్నారు.

నిర్మల్‌రూరల్‌: ఇంటర్‌ ఫలితాల్లో జిల్లాకేంద్రంలోని అల్ఫోర్స్‌ బాలికల కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో ముగ్గురు విద్యార్థులు రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. 470 మార్కులకు గాను జి.అక్షర, డి.వినీష 469 మార్కులు సాధించారు. ఎం.చైతన్య, ఆప్షన్‌ మహివీణ్‌ 468 మార్కులు, ప్రథమ సంవత్సరం బైపీసీలో ఖాన్స అలియా, ఎస్‌.జాగతి, హర్షిత 439 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారు. మీరాబు ఇఫ్తేకర్‌, హజర కునైన్‌ 438 మార్కులు, ద్వితీయ సంవత్సరం 1000 మార్కులకు గాను బైపీసీలో నబేలా తహ్రిం, కె.హారిక 995 మార్కులు, శివాని 994, త్రిపుర 994 మార్కులు సాధించారు. వీరిని అల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ అనిల్‌, అధ్యాపకులు అభినందించారు.

గురుకుల విద్యార్థుల హవా

ఉట్నూర్‌రూరల్‌: ఇంటర్‌ ఫలితాల్లో ఉమ్మడి ఆ దిలాబాద్‌ జిల్లాలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల విద్యార్థులు ఉత్త మ ఫలితాలు సాధించినట్లు రీజినల్‌ కోఆర్డినేటర్‌ అగస్టీన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలి పారు. ప్రథమ సంవత్సరం 77.65 శాతం ఉత్తీ ర్ణత నమోదైంది. టాపర్స్‌గా సీహెచ్‌.అనూష (ఆసిఫాబాద్‌) 474, ఎం.అర్చన (సిర్పూర్‌(టి) 434, రాథోడ్‌ మీనా (బుగ్గారం) 475, ఎ. హా రిక (ఉట్నూర్‌)482 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 88.68 శాతం ఉత్తీర్ణత నమోదైంది. టాపర్లుగా జి.సంజన (ఇంద్రవెల్లి)970, డి. సంజన (ఇచ్చోడ)970, వై.రాధిక (సిర్పూర్‌(టి)988, బి. సుజాత (ఉట్నూర్‌)966, ఆర్‌. నందిని (బుగ్గారం)915 మార్కులు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు.

‘ఆత్మీయ’ సమ్మేళనం

Advertisement
 
Advertisement
Advertisement