మంచిర్యాలరూరల్(హాజీపూర్):సాంబార్ వే టాడిన కేసులో ఒకరికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ లక్సెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ తీర్పునిచ్చారు.లక్సెట్టిపేట అట వీ రేంజ్ అధికారి అనిత కథనం ప్రకారం.. హాజీపూర్ మండలం టీకానపల్లికి చెందిన జాడి రాజలింగు 2025 అక్టోబర్ 17న టీకానపల్లి అడవిలో విద్యుత్ వైర్ అమర్చి సాంబార్‌ను చంపాడు. పరారీ లో ఉన్న నిందితుడిని శనివారం పట్టుబడ్డాడు. జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపర్చగా రిమాండ్ విధించగా జైలుకు తరలించారు. హాజీపూర్ డెప్యూటీ రేంజ్ అధికారి సునీత, ఎఫ్‌ఎస్‌ఓ అల్తాఫ్ హుస్సేన్, ఎఫ్‌బీఓలు పాల్గొన్నారు.


