మంచిర్యాలటౌన్: జిల్లా నుంచి హజ్‌కు వెళ్లే యాత్రికులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని మంచిర్యాల మేయర్ దర్ని మధుకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని షాదీఖానాలో సోమవారం హజ్ యాత్రికుల వ్యాక్సిన్ కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి పరిశీలించారు. 15 మంది యాత్రికులకు వ్యా క్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ అధ్యక్షుడు ముజాహిద్, వైద్యాధికారులు డాక్టర్ తబిసియ, డాక్టర్ ముస్తాఫా, డీపీవో ప్రశాంతి, సీహెచ్‌వోలు వెంకటేశ్వర్లు, నాందేవ్, జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ అఖిల్ పాషా, మాస్ మీడి యా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు.


