రోడ్డు భద్రత నియమాలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

Mar 31 2026 7:32 AM | Updated on Mar 31 2026 7:32 AM

● రామగుండం సీపీ అంబర్‌కిశోర్‌ ఝా

● రామగుండం సీపీ అంబర్‌కిశోర్‌ ఝా

జైపూర్‌: రోడ్డు భద్రత నియమాలు పాటించడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. మండలంలోని దుబ్బపల్లి పీఎల్‌ఎన్‌ఆర్‌ గార్డెన్‌లో సోమవారం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అరైవ్‌–అలైవ్‌ మూడో విడతలో భాగంగా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా మాట్లాడుతూ పోలీస్‌ శాఖ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన సదస్సులు, కంటి వైద్యశిబిరాలు, అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మైనర్‌ బాలురకు వాహనాలు ఇవ్వవద్దని, తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి సారించాలని తెలిపారు. రాత్రి వేళల్లో డ్రైవింగ్‌ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌, సీఐలు నవీన్‌కుమార్‌, బన్సీలాల్‌, కృష్ణ, స్థానిక ఎస్సై రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement