మంచిర్యాలఅగ్రికల్చర్: విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీవీఏజేఏసీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని డీఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్, కన్వీనర్లు పసుల తిరుపతి, తోట నగేష్ మాట్లాడుతూ విద్యార్హతలను బట్టి ఆర్టిజన్ కార్మికులను కన్‌వర్షన్ చేయాలని, ఏపీఎస్‌ఈడీ రూల్స్ అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ గొర్రె రమేష్, చిందం వెంకటేష్, ఉస్మాన్, దేవేందర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, మధుకర్, రాజు, ర మేష్, రాజేష్, దత్తు, తదితరులు పాల్గొన్నారు.


