ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు
నస్పూర్: ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ పేర్కొన్నారు. నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో ఆదివారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ‘నా దేశం–నా ఓటు’ నినాదంతో అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకున్న సీనియర్ సిటిజన్లు, యంగ్, దివ్యాంగ ఓటర్లు, ఉత్తమ బూత్‌స్థాయి అధికారులు, స్వీప్ నోడల్ అధికారి, కళాజాత బృందం సభ్యులు, లక్సెట్టిపేట, హాజీపూర్ తహసీల్దార్లను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు, ధ్రువపత్రాలు అందజేశారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమో దు చేసుకోవడంతోపాటు ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, జిల్లా గ్రా మీణాభివృద్ధి అధికారి కిషన్, డీపీవో వెంకటేశ్వర్‌రావు, జిల్లా విద్యాధికారి యాదయ్య, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి శంకర్, ప్రోగ్రాం అధికారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


