పశువులను తరలిస్తున్న కంటైనర్ల అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

పశువులను తరలిస్తున్న కంటైనర్ల అడ్డగింత

Jan 20 2026 7:32 AM | Updated on Jan 20 2026 7:32 AM

పశువులను తరలిస్తున్న   కంటైనర్ల అడ్డగింత

పశువులను తరలిస్తున్న కంటైనర్ల అడ్డగింత

నిర్మల్‌టౌన్‌: పశువులను తరలి స్తున్న రెండు కంటైనర్లను హిందూ వాహిని సభ్యులు సోమవారుం అడ్డుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు ఆదిలాబాద్‌ వైపు నుంచి నిర్మల్‌ మీదుగా వెళ్తున్న రెండు కంటైనర్లను స్థానిక జయశంకర్‌ చౌరస్తా వద్ద హిందూ వాహిని సభ్యులు అడ్డుకున్నారు. వాటిని తెరిచి చూడగా అందులో పశువులు ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రూరల్‌ పో లీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులో కి తెచ్చారు. అనంతరం కంటైనర్లను రూరల్‌ మండలం రత్నాపూర్‌ కాండ్లి వద్దకు తరలించి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయమై పట్టణ సీఐ ని ఫోన్‌ ద్వారా సంప్రదించగా స్పందించలేదు.

గంజాయి విక్రేత అరెస్ట్‌

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ పట్టణంలోని కోలిపురకు చెందిన కౌసర్‌ గంజాయి విక్రయిస్తుండగా అరెస్టు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ సునీల్‌ కుమార్‌ తెలిపారు. నిందితుడి నుంచి 15 గ్రాముల గంజాయితో పాటు ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కౌసర్‌తో పాటు జాహెద్‌ అనే వ్యక్తి అబ్దుల్‌ సాజిద్‌ వద్ద గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డైట్‌ మైదానం వద్ద గంజాయి విక్రయిస్తుండగా కౌసర్‌ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement