ఓటు వేయలేదని బెదిరింపులు.. అనుచిత వ్యాఖ్యలు
ఇంద్రవెల్లి: ఇరువర్గాల మధ్య రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఈ.సాయన్న తెలిపారు. మండల కేంద్రానికి చెందిన కాంబ్లే అతీష్‌కుమార్ ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి పోటీచేసి ఓడిపోయాడు. ఈ నెల 12 రాత్రి వ్యాపారి ఠాకూర్ దీపక్‌సింగ్ షేకావత్‌కు ఫోన్‌చేసి తనకు ఓటు వేయలేదని, నీతోపాటు వ్యాపారులందరి సంగతి చూస్తానని, జేసీబీతో షాపులన్నీ కూల్చివేయిస్తానని బెదిరించాడు. అంతేకాకుండా ఇంద్రవెల్లి పటేల్ మారుతి డోంగ్రేపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీపక్‌సింగ్ షేకావత్ ఫిర్యాదు మేరకు అతిష్‌కుమార్‌పై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వ్యాఖ్యలకు నిరసనగా వ్యాపారులు మార్కెట్ బంద్ నిర్వహించారు. ర్యాలీగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి అతిష్‌కుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


