‘నిందితులను అరెస్ట్ చేయకపోతే కలెక్టరేట్ ముట్టడి’
చెన్నూర్: వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ మృతికి కారణమైన నిందితులను అరెస్ట్ చేయకపోతే జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏటా మధుకర్ మృతిచెంది రెండు నెలలు కావస్తున్నా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అండదండలతో నిందితులు యథేచ్ఛగా తిరుగుతున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నిందితులను అరెస్టు చేయాలని, లేనిపక్షంలో రామగుండం సీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు బత్తుల సమ్మయ్య, తుమ్మ శ్రీపాల్, రాజశేఖర్, రాపర్తి వెంకటేశ్వర్, ఏతం శివకృష్ణ, మద్ద మధుకర్, అడుప శ్రీనివాస్, రాజేశ్, శంకర్, ప్రసాద్, చరణ్ పాల్గొన్నారు.


