సర్పంచులకు సన్మానం
మంచిర్యాలటౌన్: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలుపొందగా ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి శనివారం ఘనంగా సన్మానించారు. దొనబండ సర్పంచ్ బేతు రమాదేవి, వెల్గనూర్ సర్పంచ్ మోరుపుటాల మానస తులసి, నాగసముద్రం సర్పంచ్ నందుర్క సుగుణ, నంబాల సర్పంచ్ గోపె రాజమల్లు, లక్ష్మీపూర్ సర్పంచ్ సురమల్ల సౌజన్యలను అభినందించారు. నంబాల ఉపసర్పంచ్ బుద్దె వెంకటేశ్‌కు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.


