కేసీఆర్ దీక్ష ఫలితమే స్వరాష్ట్రం
చెన్నూర్/మందమర్రిరూరల్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన 11రోజుల ఆమరణ దీక్ష ఫలితంగా నే తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటైందని మాజీ ఎమ్మె ల్యే బాల్క సుమన్ అన్నారు. విజయ్ దివస్ సందర్భంగా మంగళవారం చెన్నూర్, మందమర్రి పట్ట ణాల్లో తెలంగాణ తల్లి, అంబేడ్కర్, గాంధీ విగ్రహా లకు పాలాభిషేకం చేసి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. భారీ ర్యాలీ అనంతరం ఏర్పా టు చేసిన కార్యక్రమాల్లో సుమన్ మాట్లాడుతూ చారిత్రాత్మక నేపథ్యాన్ని స్మరించుకోవాల్సిన అవస రం ఉందన్నారు. చెన్నూర్‌లో అభివృద్ధి, రోడ్ల విస్తరణ అంటూ వ్యాపారులను మంత్రి వివేక్ ఇబ్బందులకు గురి చేయడం సరికాదని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజ ల చేతిలో గుణపాఠం తప్పదని తెలిపారు. కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇంచార్జి రాజారమేష్, మాజీ జెడ్పీటీసీ వేల్పుల రవి, రాంలా ల్‌గిల్డా, అనిల్, మోతె తిరుపతి, ఆరీఫ్, భారతి, నా యిని సతీష్, శ్రీనివాస్, మేడిపెల్లి సంపత్, అబ్బాస్, తిరుపతిరెడ్డి, రాజశేఖర్, శంకర్, వెంకటేశ్, సూరిబాబు, సదానందం, రేఖ తదితరులున్నారు.


